ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ పాట లిరిక్స్ | సత్తెకాలపు సత్తెయ్య (1969)

 చిత్రం : సత్తెకాలపు సత్తెయ్య (1969)

సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్

సాహిత్యం : ఆత్రేయ

గానం : పి.బి. శ్రీనివాస్


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


ఏ ఇంటి పంటవో ఏ తల్లి నోమువో

ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ..నా వంటి పేదకూ

ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ..నా వంటి పేదకూ

ప్రాణాలు పోసావు..బతకాలి అన్నావు

ఉరితాడు జో జోల ఉయ్యాల చేసావు

ఉయ్యాల చేసావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో

నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో

చిన్నారి పొన్నారి..చిగురల్లె వెలిసావు

సిరిలేదు గిరిలేదు..మనసుంటే అన్నావు..

మనసుంటే అన్నావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ..బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ..బజ్జోమ్మ నువ్వూ


Share This :



sentiment_satisfied Emoticon