అల్లారు ముద్దుకదే పాట లిరిక్స్ | మనసే మందిరం (1966)

 చిత్రం : మనసే మందిరం (1966)

సంగీతం : ఎం. ఎస్. విశ్వనాధన్

సాహిత్యం : ఆత్రేయ

గానం : పి.సుశీల


అల్లారు ముద్దుకదే

అపరంజి ముద్దకదే

తీయని విరితోట కదే

దివి ఇచ్చిన వరము కదే


అల్లారు ముద్దుకదే

అపరంజి ముద్దకదే

తీయని విరితోట కదే

దివి ఇచ్చిన వరము కదే


అల్లారు ముద్దుకదే


చిరు చిరు మువ్వలతో చిందాడే నడక కదే

చిన్నారి మొహములోన సిరులొలికే నగవు కదే

చిన్నారి మొహములోన సిరులొలికే నగవు కదే

చినికిన తేనెవి తొలకరి వానవి

చినికిన తేనెవి తొలకరి వానవి

చిదిమిన మెరుపు కదే

చెంగల్వ మెరుగు కదే 


అల్లారు ముద్దుకదే

అపరంజి ముద్దకదే

తీయని విరితోట కదే

దివి ఇచ్చిన వరము కదే


అల్లారు ముద్దుకదే


పదినెలలు హృదయంలో పండినట్టి తపసు కదే

పలుకని దైవాన్నీ పలికించే తల్లి కదే

పలుకని దైవాన్నీ పలికించే తల్లి కదే

ఇంటికి వెలుగుకదే

కంటికి కలవు కదే

ఒంటరి బ్రతుకైనా

ఓపగలుగు తీపికదే


అల్లారు ముద్దుకదే

అపరంజి ముద్దకదే

తీయని విరితోట కదే

దివి ఇచ్చిన వరము కదే


అల్లారు ముద్దుకదే 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)