మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా పాట లిరిక్స్ | మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

 చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు


మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో

జీవితాలు శాశ్వతాలు కావురా..

దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా


కాదురా ఆటబొమ్మ.. ఆడదే నీకు అమ్మ

ఎత్తరా కొత్త జన్మ.. ప్రేమ నీ తాత సొమ్మా

తెలుసుకో తెలివిగా మసలుకో

(ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము)

అలుసుగా ఆడకు మనసుతో


ఆ ప్రేమ ధనికుల విలువలు గని

నీ వంటి ధనికులు వెలవెలమని

ఆ ప్రేమ ధనికుల విలువలు గని

నీ వంటి ధనికులు వెలవెలమని

జీవిస్తే ఫలితమేమిటి..

శ్రీరాగమున కీర్తనలు మానరా


దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా


ప్రేమకై నీవు పుట్టు..  ప్రేమకై నీవు బ్రతుకు

ప్రేమకై నీవు చచ్చి..  ప్రేమవై తిరిగి పుట్టు

మరణమే లేనిది మనసురా..


క్షణికమే యవ్వనమ్ము.. కల్పనే జీవనమ్ము

నమ్ముకో.. దిక్కుగా ప్రేమనే

ఈ జనన మరణ వలయములనిక

ఛేదించి మమతను మతమనుకుని

ఈ జనన మరణ వలయములనిక

ఛేదించి మమతను మతమనుకుని

జీవించే మోక్షమార్గము

శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన


దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో

జీవితాలు శాశ్వతాలు కావురా

దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా


Share This :



sentiment_satisfied Emoticon