చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి
అరె ఏమైందీ...
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ.. ఆఆఅ...ఆఆ...
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ...
నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ - పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవూ - నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు
అది దోచావూ... లలలల లలలల ల ల ల
బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు
రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడూ...
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ..
అది ఏమైందీ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon