చిత్రం : చిరుజల్లు
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర, వందేమాతరం, విశాఖ
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
మాధవా రానీవా మోహన రాగాలే నను మైమరిపించేలా
రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై
హే నందనందనా అందుకుందునా ఎందుచూసినా
నిన్ను చూసినా పదివేల రూపాలా
రాధికా రాలేవా వంశీనాదాలే నడిపించే పాదాలై
ఇదిగో హృదయం అందుకోవ గిరిధారీ
ఎదలో ప్రణయం భారమైంద సుకుమారీ
ఎన్నెన్నో జన్మాల నుంచి
మోస్తున్న మృదుభావంనుంచి
తప్పించుకోలేవు ఇంక మధువైరీ
నీ ప్రాణం నాలోనే ఉంచి
బంగారు చిలకల్లె పెంచి
కాపాడుకుంటూనే ఉన్నా చిన్నారీ
కొంటెమాట నమ్మలేను మాటకారీ
ఒట్టుపెట్టి చెప్పు మళ్ళీ ఒక్కసారి
మురిపించు నను చేరి
రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై
తనువా నలుపు నా పెదవికెందుకీ ఎరుపు
మబ్బుల్లో మెరుపు నీ పెదవిపైన నా తలపు
ఏవేవో అడిగిందీ వచ్చి
నీ వేడి నిట్టూర్పు తెచ్చి
అల్లాడి పోతున్న పిల్ల వడగాలీ
ఎవేవి నోముల్ని నోచి
నీ చేత వాలింది అని
ఈ పిల్లంగ్రోవిని కాస్త అడగాలీ
మురళివి నువ్వే కాద పిచ్చి రాధా
ఈ వేణునాదం నీ మౌనాల పాట కాదా
నిను నీవే పోల్చలేదా
మాధవా రానీవా మోహన రాగాలే నను మైమరిపించేలా
రాధికా రాలేవా వంశీ నాదాలే నడిపించే పాదాలై
నందనందనా అందుకుందునా ఎందుచూసినా
నిన్ను చూసినా పదివేల రూపాలా
రాధికా రాలేవా వంశీనాదాలే నడిపించే పాదాలై
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
రాధె రాధె జపాకరో కృష్ణమోరస్ పియాకరో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon