భళీ భళీ ఏమి భాగ్యము పాట లిరిక్స్ | శ్రీ కృష్ణార్జున విజయం (1996)

 చిత్రం : శ్రీ కృష్ణార్జున విజయం (1996) 

సంగీతం : మాదవపెద్ది సురేష్ 

సాహిత్యం : వెన్నెలకంటి

గానం : జానకి, బి.ఎ.నారాయణ


ఉత్తిష్టోత్తిష్ట శ్రీకృష్ణ ఉత్తిష్ట యదునందన

ఉత్తిష్ట భక్తమందార కర్తవ్యం భువన పాలనం

కర్తవ్యం భువన పాలనం


భళీ భళీ ఏమి భాగ్యము

భళీ భళీ ఏమి భాగ్యము

నవమోహనాంగ జన్మాష్టమి నాడు 

నీకు సతులు జేరి సొగసు చేయ 

భళీ భళీ ఏమి భాగ్యము

నవమోహనాంగ జన్మాష్టమి నాడు 

నీకు సతులు జేరి సొగసు చేయ 

భళీ భళీ ఏమి భాగ్యము


యదుకుల తిలక నీ నెన్నుదుటను ముద్దుగా 

కస్తూరి తిలకము నే కొలువారగ దిద్దనా 

వెన్నలు దోచిన ఈ వెన్నుని కర యుగముల 

చెన్నుగ కంకణములు మురిపెముగా తొడగనా 

చెలువల వలువలనే దోచిన స్వామికీ 

చెలువగు ఎదపై నే కౌస్తుభమణినుంచనా 

వైజయంతి మాల వేతు వలపెరిగిన విభునికిపుడు 


భళీ భళీ ఏమి భాగ్యము

నవమోహనాంగ జన్మాష్టమి నాడు 

నీకు సతులు జేరి సొగసు చేయ 

భళీ భళీ ఏమి భాగ్యము


మన్నులు తిన్న మా మాధవుని మోవికి 

మోహన మురళినే ముదముగా అందించనా

గోవుల గాచిన గోపాలునకే గోముగా 

చల్లని పన్నీటినే చిరుజల్లుగ జల్లనా

నందకిశోరుని డెందము అలరగా 

హరితనువంతా హరిచందనమే పూయనా 

నీలమేఘ శ్యామలాంగ నీరాజనమిదే నీకు 


భళీ భళీ ఏమి భాగ్యము

నవమోహనాంగ జన్మాష్టమి నాడు 

నీకు సతులు జేరి సొగసు చేయ 

భళీ భళీ ఏమి భాగ్యము


హే కృష్ణా ఆది మధ్యాంత రహితా 

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా 

శృంగార రత్నాకరా 


భళీ భళీ ఏమి భాగ్యము

నవమోహనాంగ సతులందరు

సొగసు చేయ కాంచు ఫలము నాకు కలిగె

భళీభళీ భళీభళీ భళీభళీ ఏమి భాగ్యము

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)