చిత్రం : మంచి మనసులు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి
లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..
లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో..
ఈ వెల్లువలో ఎమవుతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon