చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : బాలు, సుశీల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
జవరాలి జడలోనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ..
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ....
జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ..
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
సుతిమెత్తగా నీవు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు..
ఉసిగొల్పి ఉసిగొల్పి..కళ్ళుమూస్తావు
సుతిమెత్తగా నీవు..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుతిమెత్తగా నువ్వు..తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు
ఉల్లాసకేళికి..ఆ ఆ ఆ ఆ ఆ
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు..
ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు
ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon