చిత్రం : అర్థాంగి (1955)
సంగీతం : బి.నరసింహరావు.ఎమ్.వేణు
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల
ఇంటికి దీపం ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే
సుఖాల పంటకు జీవం ఇల్లాలే ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే
కళకళలాడుతు కిలకిల నవ్వుతు
కళకళలాడుతు కిలకిల నవ్వుతు
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
పతికే సర్వము అర్పించునుగా
ఇంటికి దీపం ఇల్లాలే
నాధుని తలలో నాలుక తీరున
నాధుని తలలో నాలుక తీరున
మంచి చెడులలో మంత్రి అనిపించును
మంచి చెడులలో మంత్రి అనిపించును
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించునూ.
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించును
సహచర్యములో, పరిచర్యలలో
సహచర్యములో, పరిచర్యలలో
దాసిగా తరింప జూచుచు
దాసిగా తరింప జూచుచు
దయావాహిని - ధర్మరూపిణి
భారత మానిని - భాగ్యదాయినీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon