తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే పాట లిరిక్స్ | అడవిరాముడు (1977)

చిత్రం : అడవిరాముడు (1977)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, సుశీల


కుకు కుకు కుకు కుకు

కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం

వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి

పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి


తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన

పిల్లదానికొచ్చిందీ కళా...పెళ్ళి కళా

తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన

పెళ్ళికొడుకు నవ్వితే తళా... తళతళా

పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా

చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా

పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా

చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా

అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే

అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలే


కుకు కుకు కుకు కుకు

కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి


కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు

తెలుసుకున్న కనుల నీలినీడలే కథా... ప్రేమకథా

బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు

మొగ్గవలపు విచ్చితే కథా...పెళ్ళి కథా

ఇరుమనసుల కొకతనువై ఇరుతనువులకొక మనువై

మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై

ఇరుమనసుల కొకతనువై ఇరుతనువులకొక మనువై

మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై

కలిసివున్న నూరేళ్ళు కలలుగన్న వెయ్యేళ్ళు

మూడుముళ్ళు పడిననాడు ఎదలు పూలపొదరిళ్ళు


కుకు కుకు కుకు కుకు

కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం

వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి

పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి


కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం

కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం 


Share This :



sentiment_satisfied Emoticon