చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్ , చిత్ర
ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ
ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి
ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ
ఇంతకీ ఏడుందే అత్తింటి దారీ
హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
వగలమారి నావ, హొయలు మీరినావ,
అలలు ఊయలూగినావ
తళుకు చూపినావ, తలపు రేపినావ,
కలల వెంట లాగినావ
ఓఓఓఓఓ..ఓఓఓఓఓ
సరదాగ మితిమీరి అడుగే ఏమారి
సుడిలో పడదోసే అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా
పోదాంపద ఆగకేమరీ
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఓ..నీటిలోని నీడ చేతికందుతుందా
తాకిచూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడికాద
తరిమిచూడు దొరుకుతుందా
ఓహోహోఓఓఓఓ..ఓఓఓఓఓ...
చక్కానిదానా చుక్కానికానా నీ చిక్కులన్నీ దాటగా
వద్దూ అనుకున్నా వదలను నెరజాణా
నేనే నీ జంటని రాసి ఉందిగా
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon