గువ్వలా ఎగిరిపోవాలీ పాట లిరిక్స్ | అమ్మకోసం (1970

 చిత్రం : అమ్మకోసం (1970)

సంగీతం : ఆదినారాయణరావు

సాహిత్యం : సినారె

గానం : బాలు


ఆ హ హా..ఆ ఆ ఆ ఆ ఆఆఅ

ఒ హొ హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓఓ ఓఓఓ

హె హేయ్..గువ్వలా..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలో..

మూగ కన్నీరు మిగిలేను కనుపాపలో

ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలో..

మూగ కన్నీరు మిగిలేను కనుపాపలో

ఆ కన్నీరు తుడిచే..ఏ ఏ ఏ ఏ

పన్నీరు చిలికే..ఏ ఏ ఏ ఏ ఏ

ఆ కన్నీరు తుడిచే..పన్నీరు చిలికే

చల్లని ఆ చేయి కావాలి

ఆమె చెరణాలపై వాలిపోవాలి


గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


జగమంత ఒకవింత చదరంగము

పాడు విధియేమో..కనరాని సుడిగుండము

జగమంత ఒకవింత చదరంగము

పాడు విధియేమో..కనరాని సుడిగుండము

ఆ లోతులు చూచీ..ఈ ఈ ఈ

రీతులు తెలిసి..ఈ ఈ ఈ

ఆ లోతులు చూచీ..రీతులు తెలిసి

అలలాగ చెలరేగి పోవాలీ

నేననుకొన్న గమ్యం చేరాలీ


గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ

ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


Share This :sentiment_satisfied Emoticon