చిత్రం : కడలి
సాహిత్యం : వనమాలి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శక్తిశ్రీగోపాలన్
గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే
తేనె చూపే చల్లావు నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహరం కుడిసేతి గడియారం
పెద్ద పులినైన అణిచే అధికారం
నీవెళ్లినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే
ఇంక అది మొదలు నామనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా
గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గువ్వే ముసుగేసిందే రావాకే కునికిందే
పాలేమో పెరుగులాగ ఇందాకే పడుకుందే
రాసకురుపున్నోళ్లే నిదరోయే వేళల్లోన
ఆశ కురుపొచ్చి ఎదే అరనిమిషం నిదరోదే
గుంజుకున్నా నిన్ను ఎదలోకే
ఎంగిలి పడనే లేదే అంగిలి తడవనే లేదే
ఆరేడునాళ్లై ఆకలి ఊసేలేదే
పేద ఎదనే దాటి ఏదీ పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరేదే హ..
హో..గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్లకి ఈడేరునో ఈబతుకే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon