చిత్రం : కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : నరేంద్ర, శ్రావణ భార్గవి
అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...
తననొదిలి ఎటువైపు కను కదలని చూపు
నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు
ఊహ విహారమా సాగే సరాగమా
సరదా తగదు సుమ సుతారమా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే
అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...
అవునా... ఇతనేనా ఇన్నాళ్ళు యెదరున్నది కాదా మరి
అయినా... ఇంతకుముందేనాడు పరిచయమైనా లేనట్టుంది
ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా
వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా
కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం
తెలిపి కథా క్రమం ఏం చెబుతాం
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే
అబలా... ఏమైపొతున్నావే సుడిగాలిలో చిగురాకులా
నువ్వలా... ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో
నీలో ఇదే కదా మొదలు ఈ నిషా లయలు గమనించావా
లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా
ఏదో అయోమయం అయినా మహా ప్రియం
దాన్నే కదా మనం ప్రేమంటాం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon