చిత్రం : మయూరి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం
కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఆఆఆఆ.. ఆఆఅ...
పాదపూజకై మందారమైనా
నాద మధువుతో మంజీరమాయె
దేవతార్చనకు ఏ కీర్తనైనా
జీవితాంతమీ రస నర్తనాయె
వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం
వాఙ్మయమే వచనం ఆంగికమే భువనం
అకాశాలలో తారలన్నీ
ఆహార్యాలుగా అందుకుంటూ
కైలాసాల శిఖరాగ్రాలందు
కైవల్యాలు చవిచూసే వేళలో
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఆఆఆఆ.. ఆఆఅ...
పడమటెండల పారాణి తూలె
సంధ్యారాగాలతో ఊసులాడే
కొలనులు నిదరోవు కార్తీక వేళ
కలువలలో తేనె గిలిగింతలాయె
సకల కళా శిఖరం నర్తనమే మధురం
సకల కళా శిఖరం నర్తనమే మధురం
కాశ్మీరాలలో పూల గంధం
కేదారాలలో సస్యగీతం
శివలాస్యాల శృంగారాలెన్నో
అంగాంగాల విరబూసే వేళలో
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం
కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం
నరనారీ సంగమ రంగం
ఆఆఆఆ.. ఆఆఅ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon