దేవీ దుర్గాదేవీ పాట లిరిక్స్ | సంకీర్తన

 చిత్రం : సంకీర్తన

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సినారె

గానం : బాలు, వాణీ జయరాం


దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ

ఆంగికం వాచికం అన్ని నీవే 

అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే

ఆంగికం వాచికం అన్ని నీవే 

అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే

దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ దేవీ


కాల భయకర శూలి ప్రియకర మూల మాతృకవే

రాగ సుందర రౌద్ర భందుర యోగలోచనివే

కాల భయకర శూలి ప్రియకర మూల మాతృకవే

రాగ సుందర రౌద్ర భందుర యోగలోచనివే

జరుపవేమి మనుజ మహిష మర్ధన

నెరపవేమి సామ్య ధర్మ రక్షణ

జరుపవేమి మనుజ మహిష మర్ధన

నెరపవేమి సామ్య ధర్మ రక్షణ

తాప వారిణి పాప హారిణి

అనంత దిగంత దృగంత చారిణి.. దేవీ..


దేవీ కవితాదేవీ..దేవీ కవితాదేవీ..

ధ్యానమూ, గానమూ అన్ని నీవే 

నన్నంటి రావే.. నన్నంటి రావే

ధ్యానమూ, గానమూ అన్ని నీవే

నన్నంటి రావే.. నన్నంటి రావే

దేవీ కవితాదేవీ.. దేవీ..

 

పా రిపమని పాప మపని సాస పనిస రీరి.. 

వాలుకనుగవలోనా మరుని ఆన విరుల వాన

రిగారిస రిగారిస రిసస్స రిరి పనిప పానిప మపప..

సంచాలిత సంచారిత పదాలు 

సాందీకృత చాంద్రీమయ నదాలు

రిసమరి గరి రిసమరి పమ రిగరి  

అనితరములు అభినయ విలాసములు

రిసమరి పమ నిప మరిగరిరి సమ 

రిపమనిప సనిప మపమ రిగరి 

రిసమరి పమ నిప మరిగరిరి సమ 

రిపమనిప సనిప మపమ రిగరి 

సరిమ రిమప మపని గనిసరీ

నిసరి సరిమ రిమప మపనిసా  


పాల నవ్వులలోన భావన పైట సవరించే 

తీగ నడుమున సోగ బిడియము తూగి నటియించే

పాల నవ్వులలోన భావన పైట సవరించే

తీగ నడుమున సోగ బిడియము తూగి నటియించే

అందుకుంటే తీపి బెదురు అల్లన

అందకుంటే గుండె గుబురు జల్లన

అందుకుంటే తీపి బెదురు అల్లన

అందకుంటే గుండె గుబురు జల్లన

ఎంత విరహం ఎంత మధురం

వెన్నెల్లో దూపాలు కళ్ళల్లో దీపాలు


దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గా దేవీ.. 

ఆంగికం వాచికం అన్ని నీవే 

అఖిలాత్మ నీవే.. అఖిలాత్మ నీవే

దేవీ దుర్గాదేవీ.. దేవీ దుర్గాదేవీ దేవీ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)