ఏకాంత వేళ పాట లిరిక్స్ | అన్వేషణ (1985)

 చిత్రం : అన్వేషణ (1985)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, జానకి


ఏకాంత వేళ.. మ్మ్.. 

ఏకాంత సేవ.. మ్మ్..

ఏకాంత వేళ.. కౌగిట్లో

ఏకాంత సేవ.. ముచ్చట్లో

పడుచమ్మ దక్కే.. దుప్పట్లో

దిండల్లె ఉండు.. నిద్దట్లో

కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా

మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై

ఏకాంత వేళ.. కౌగిట్లో

ఏకాంత సేవ.. ముచ్చట్లో

ఏకాంత వేళా...


ముద్దు సాగిన.. ముచ్చట్లో

పొద్దు వాలదు.. ఇప్పట్లో

ముద్దు సాగిన.. ముచ్చట్లో

పొద్దు వాలదు.. ఇప్పట్లో

కమ్ముకున్న ఈ కౌగిట్లో..

కాటుకంటి.. నా చెక్కిట్లో

నన్ను దాచుకో.. నా ఒంట్లో

పడకు ఎప్పుడూ.. ఏకంట్లో

నన్ను దాచుకో.. నా ఒంట్లో

పడకు ఎప్పుడూ.. ఏకంట్లో

ఆ చప్పట్లు.. ఈ తిప్పట్లు

నా గుప్పెట్లో


ఏకాంత వేళ.. కౌగిట్లో

ఏకాంత సేవ.. ముచ్చట్లో

పడుచమ్మ దక్కే.. దుప్పట్లో

దిండల్లె ఉండు.. నిద్దట్లో

కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా

మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై

ఏకాంత వేళ.. కౌగిట్లో

ఏకాంత సేవ.. ముచ్చట్లో

ఏకాంత వేళా...


గుబులు చూపుల.. గుప్పిట్లో

ఎవరు చూడని.. చీకట్లో

గుబులు చూపుల.. గుప్పిట్లో

ఎవరు చూడని.. చీకట్లో

చిక్కబోములే.. ఏకంట్లో

ఎదలు కలుపుకో.. సందిట్లో

దేవుడొచ్చిన.. సందట్లో

ఎదురులేదులే.. ఇప్పట్లో

దేవుడొచ్చిన.. సందట్లో

ఎదురులేదులే.. ఇప్పట్లో

ఆ.. చెక్కిట్లో

రా.. కౌగిట్లో

మ్మ్.. నిద్దట్లో


ఏకాంత వేళ.. కౌగిట్లో

ఏకాంత సేవ.. ముచ్చట్లో

పడుచమ్మ దక్కే.. దుప్పట్లో

దిండల్లె ఉండు.. నిద్దట్లో

కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా

మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై

ఏకాంత వేళ..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)