ఇది సంగీత సంగ్రామమూ పాట లిరిక్స్ | పక్కింటి అమ్మాయి (1980)


చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి ??

గానం : బాలు, చక్రవర్తి


ఇది సంగీత సంగ్రామమూ

ఇది సంగీత సంగ్రామమూ

స్వర కిరీటినీ.. లయ విరాట్టునీ

సరస సంగీత చక్రవర్తినీ..


ఇది సంగీత సంగ్రామమూ 

శృతికి మేటిని గతికి పోటిని

బాల గంధర్వ నామ కీర్తినీ


ఇది సంగీత సంగ్రామమూ


శంకరాభరణ రాగంలో డొంకలు తిరిగే పాండిత్యం

వంకర టింకర తాళంలో వంకరబోయే సాహిత్యం

శివశంకర నటరాజ భాగవత సంగీతం అని తెలుసుకో

అది చస్తే రాదని ఇట్టే పోదని తెలుసుకో మసలుకో


ఇది సంగీత సంగ్రామమూ..


స్పందించే నా హృదయంలో సుడి రేగిందొక తాళం

నినదించే నా నాడులలో చెలరేగిందొక రాగం

నీ శశభిషలకు నీ బెకబెకలకు తిరిగిపోదులే ఈ గానం

మడిచి పెట్టు ఇక విడిచిపెట్టు నీ పిలకజుట్టు సంగీతం

శివశంకరా యమకింకర ఇంక ఆపరా...ఆఅ...


ఇది సంగీత సంగ్రామమూ..


వినరా బాల ఆపర గోలా

స్వర గురువును నేనని తెలుసుకో

బాలుడనైనా లఘువును కానని తెలుసుకో 

నీ పాటకు దరువును బరువుగ నీవే దిద్దుకో

ఇంతకు నీదే గ్రామం..

అది సంగీతానికి సాలగ్రామం


ఇది సంగీత సంగ్రామమూ..


Share This :



sentiment_satisfied Emoticon