చిత్రం : లక్ష్మీనివాసం (1968)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : పిఠాపురం
సోడాయ్ సోడాయ్ ఆంధ్రసోడా
గోలిసోడాయ్ జిల్ జిల్ సోడాయ్
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా నెత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా
అహ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
నేత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా
అహ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
ఆంధ్రాసోడా కోరికోరి తాగుతారోయ్
అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు..ఊ..
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
పోసుకోలు పాలిటిక్స్ పరమ గ్యాసు
వాటికన్నా ఉపయోగం సోడా గ్యాసు
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో
అహ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో
అహ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
రాళ్ళు తిని తాగితే జీర్ణమవ్వాలి
ఈ నీళ్ళు తాగితే సగం కడుపు నిండాలి
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రాసోడా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon