చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వీటూరి
గానం : బాలు
మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే
కమాన్ క్లాప్స్..
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నాలో రేపావూ..ఊ..జ్వాల
ఒకరితో పాడేవూ..ఊ..జోల
నను మరచి పోవడం..న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు
వలపు గుండెకే..గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే..ఏయ్
హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
కృష్ణుడు ఆశపడి...రాగ
రాధిక వేరు పడి...పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన..
కనరాకపోవు నా ఉదయము
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
మాటే మరచావే..ఏఏఏ..చిలకమ్మ
మనసువిరిచావే..ఏఏఏ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon