చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : జానకి
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ...ఈ.. పున్నమి రా...
పగలైతే దొరవేరా...
రాతిరి నా రాజువురా...
రాతిరి నా.... రాజువురా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon