నీలి నీలి మేఘాల లీనమై పాట లిరిక్స్ | వీరాభిమన్యు (1965)

 చిత్రం : వీరాభిమన్యు (1965)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : ఆరుద్ర

గానం : ఘంటసాల, సుశీల


అదిగో నవలోకం  వెలసే మనకోసం

ఆహాహ్హహహ..ఆఅ..ఓహో.హోఓ.హో..

అదిగో నవలోకం  వెలసే మనకోసం

అదిగో నవలోకం  వెలసే మనకోసం


నీలి నీలి మేఘాల లీనమై

ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై

నీలి నీలి మేఘాల లీనమై ..

ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై

దూర దూర తీరాలకు సాగుదాం

సాగి దోర వలపు సీమలో ఆగుదాం

దూర దూర తీరాలకు సాగుదాం

సాగి దోర వలపు సీమలో ఆగుదాం

ఎచట సుఖముందో ఎచట సుధ కలదో

అచటె మనముందామా

 


 

అదిగో నవలోకం వెలసే మనకోసం


పారిజాత సుమదళాల పానుపు

మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు

పారిజాత సుమదళాల పానుపు

మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు

ఫలించె కోటి మురిపాలు ముద్దులు

మన ప్రణయానికి లేవుసుమా హద్దులు

ఫలించె కోటి మురిపాలు ముద్దులు

మన ప్రణయానికి లేవుసుమా హద్దులు

ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో

అచటె మనముందామా

 

అదిగో నవలోకం వెలసే మనకోసం

అదిగో నవలోకం వెలసే మనకోసం

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)