ఆ నవ్వులో ఏమున్నదో చలించింది పాట లిరిక్స్ | ఎలాచెప్పను (2003)

 చిత్రం : ఎలాచెప్పను (2003)

సంగీతం : కోటి

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : కార్తీక్

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా

ఆ కళ్లతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా

ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది

మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది..

ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

నచ్చచెప్పినా ఏ ఒక్కరూ నమ్మరే ఎలా నన్నిప్పుడు నేనే నేనన్నా

మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా

అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా

అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా

ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

గుర్తుపట్టనే లేదసలు గుండె లోతులో గుసగుసలు తానొచ్చేదాకా

తెలివి చెప్పింది తుంటరిగా వయసు వచ్చిందనీ

తలుపు తట్టింది సందడిగా నిదర ఎన్నాళ్లనీ

తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా

ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా

ఆ కళ్లతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా

ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది

మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది..

ఔనన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

Share This :

sentiment_satisfied Emoticon