తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే పాట లిరిక్స్ | మనసంతానువ్వే (2001)

 చిత్రం : మనసంతానువ్వే (2001)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఆర్.పి.పట్నాయక్

గానం : సంజీవని, ఉష


తూనీగా తూనీగా 

ఎందాకా పరిగెడతావే 

రావే నా వంకా

దూరంగా పోనీకా 

ఉంటాగ నీ వెనకాలే 

రానీ సాయంగా

ఆ వంక ఈ వంక హొహొ తిరిగావే ఎంచక్కా

ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క

ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

 

తూనీగా తూనీగా 

ఎందాకా పరిగెడతావే 

రావే నా వంకా


దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసిఇస్తున్నాగా

వదిలేయకు సీతాకోక చిలకలుగా

వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా

సూర్యుణ్ణే కరిగిస్తాగా చినుకులుగా

సూర్యుడు ఏడి నీతో ఆడి

చందమామ అయిపోయాడుగా


తూనీగా తూనీగా 

ఎందాకా పరిగెడతావే 

రావే నా వంకా


ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి

తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా

ఓ సారటువైపెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది

ఈరైలుకి సొంతూరేదో గురుతురాదెలా 

కూ కూ బండి మా ఊరుంది 

ఉండిపోవే మాతో పాటుగా

 

తూనీగా తూనీగా 

ఎందాకా పరిగెడతావే 

రావే నా వంకా

దూరంగా పోనీకా 

ఉంటాగ నీ వెనకాలే 

రానీ సాయంగా 

ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా

ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క

ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)