చిత్రం : తోట రాముడు (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
గానం : బాలు, సుశీల
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ..
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ.. ఓ.. ఓహో..హో..హో..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా
మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
సన్నజాజి తీగుంది
తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది
జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో
మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon