విన్నారా విన్నారా పాట లిరిక్స్ | దేవుడు చేసిన మనుషులు (1973)

 చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

సాహిత్యం : ఆరుద్ర

గానం : ఘంటసాల, సుశీల


మరల రేపల్లెవాడలో.. మురళి మోగె

మోడువారిన హృదయాలు పూయసాగె..


విన్నారా..  విన్నారా..

అలనాటి వేణుగానం మోగింది మరల..

అలనాటి వేణుగానం మోగింది మరల

చెలరేగే మురళీ సుధలు..

తలపించును కృష్ణుని కథలు..  విన్నారా


పుట్టింది ఎంతో గొప్పవంశం..

పెరిగింది ఏదో మరో లోకం

పుట్టింది ఎంతో గొప్పవంశం.. 

పెరిగింది ఏదో మరో లోకం

అడుగడుగున గండాలైనా

ఎదురీది బతికాడు

అడుగడుగున గండాలైనా

ఎదురీది బతికాడు

చిలిపి చిలిపి దొంగతనాలు

చిననాడే మరిగాడు

దొంగైనా.. దొర అయినా..

మనసే హరించేనులే   


విన్నారా..

అలనాటి వేణుగానం మోగింది మరల

అలనాటి వేణుగానం.. మోగింది మరల


ద్వేషించే కూటమిలోన నిలచి.. 

ప్రేమించే మనిషేకదా మనిషి

ద్వేషించే కూటమిలోన నిలచి.. 

ప్రేమించే మనిషేకదా మనిషి

ఆడేది నాటకమైనా

పరుల మేలు  తలచాడు

ఆడేది నాటకమైనా

పరుల మేలు  తలచాడు

అందరికీ ఆనందాల

బృందావని నిలిపాడు

ఆ నాడు..  ఈ నాడు మమతే తరించేనులే 


విన్నారా.. 

అలనాటి వేణుగానం మోగింది మరల

చెలరేగే మురళీ సుధలు..

తలపించును కృష్ణుని కథలు..  విన్నారా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)