చిత్రం : అనురాగ సంగమం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : గోపీ
గానం : బాలు
నవ్వింది రోజా పూదోటలో
ఆ స్నేహ రాగం ఏ జన్మదో
వలపు వాన ముంగిట కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం ప్రతి రోజూ పాడేమూ
నవ్వింది రోజా పూదోటలో
నా గుండె గుడిలో నువు కొలువై
చిననాటి తోడై నిలిచితివే
నీవే లేక నేనే శూన్యం
పాడే గీతం నా చెలికోసం
నా పాట నీకు వినిపించదా
నాటి వలపులు నాటి తలపులు
నాలోని రాగమై పలికెనే
నా కంటి వెన్నెలై విరిసెనే
నా గొంతు పల్లవించెనే
నువ్వు కన్న కలలు పండెనే
నవ్వింది రోజా పూదోటలో
నీ ప్రేమ బంధం మది కదలీ
నా గుండె బరువై రగిలినదే
పాటకు నీవే స్వరమైనావే
కంటికి మాత్రం కరువైనావే
రేపగలు నాలో నీ ధ్యానమే
రాగదీపం నువ్వు
రాజ మేఘం నీవు
కోరేవు నువ్వు రమ్మనీ
రాలేకపోతినే రాలేదనీ
నా తప్పు మన్నింతువో
నన్ను మరల ఆదరింతువో
నవ్వింది రోజా పూదోటలో
వలపు వాన ముంగిట కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం ప్రతి రోజూ పాడేమూ
నవ్వింది రోజా పూదోటలో
ఆ స్నేహ రాగం ఏ జన్మదో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon