ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక లిరిక్స్ | ప్రేమలేఖ

చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, అనురాధాశ్రీరామ్





ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక
నీ తలుపుతోనే నే బ్రతుకుతున్నా . . .
నీ తలపుతోనే నే బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక...

వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
అనుక్షణం నామనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీకధలే
కనులకు నిదురలే కరువాయె

ప్రియా నిను చూడలేక
ఊహలో నీరూపు రాక

కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని
దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దయినా అందించరాదా
నినుగాక నీ కలనీ పెదవంటుకోదా
వలపులు నీదరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక
ఊహలో నీరూపురాక
హాఅ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . .
నీ తలపుతోనే నే బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక...
Share This :



sentiment_satisfied Emoticon