మబ్బులోన చందమామ లిరిక్స్ | సాహసమే జీవితం

చిత్రం : సాహసమే జీవితం (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్







బాదలోంమే..చంద్రమా..దిల్హీ దిల్మే  చాందినీ..
బాదలోంమే..చంద్రమా...దిల్హీ దిల్మే చాందినీ..
ఘూంఘట్ కె పీచే..ఖూబ్ సూరత్..సమఝ్ మే..బసే..హ..హా
బాదలోంమే..చంద్రమా..దిల్హీ దిల్మే చాందినీ.

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త..తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ

లేత గాలి సోకగానే..నీలిమబ్బు కరిగిపోయే
జాబిలమ్మ వెలగదా...జాజివాన కురవదా..ఆ..ఆ
బిడియమే..ఏ..ఏ.. తీరిపోయి..వడికి తాను చేరదా..ఆ..
కనులతో..ఓ..ఓ.. ముద్దులాడి..కౌగిలింతలీయదా..ఆ
మోము చాటు చేసినా..ఆ..ఆ.. మోహనమేగా..ఆ..ఆ..

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ

కన్ను నేను గీటగానే..కన్నె సిగ్గు తీరిపోయే..
జోరు ఇంక..ఆగునా...జారు పైట నిలుచునా..ఆ
ఎవ్వరెన్ని వాగినా..ఆ... యవ్వనాలు దాగునా..ఆ
కొమ్మ పూలు పూయగా..ఆ..తుమ్మెదొచ్చి వాలదా..ఆ..
ఎంత దూరమేగినా..ఆ.. చేరువకేగా..ఆ..

పాటలాంటి వయస్సు నాది..పల్లవించు సొగస్సు నీది
శరణమయిన సాగదా..ఆ..చెలిని నేను చేరగా..
ప్రణయమే గానమైన..హృదయవీణ మ్రోగదా..ఆ
పల్లకీ..ఈ..కోరుకున్న..పడుచు ఆశ తీరదా..ఆ
విరహబాధ తీయనీ..వేదన కాదా..ఆ..ఆ

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త.. తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మా...
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)