నాతోనే నువ్వు నాలోనే నువ్వు లిరిక్స్ | స్తాడు నా రాజు

 చిత్రం : వస్తాడు నా రాజు  (2010)

రచన : రామజోగయ్యశాస్త్రి

సంగీతం : మణిశర్మ, గానం : సాకేత్, సైంధవి


పల్లవి :

నాతోనే నువ్వు నాలోనే నువ్వు

ఐనా నువు నాతో లేవు॥

ఎక్కడ నేనున్నా

నా పక్కనే ఉంటావు

పక్కన ఉంటూనే

నన్ను ఒంటరి చేశావు

ఇప్పటికి ప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది

చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది॥

చరణం : 1

ఎన్నో అనుకున్నా ఏదీ నీతో అనలేదే

ఏవో కలలుగన్నా నీతో పంచుకోలేదే

సమయం కొనసాగదే హృదయం తనలాడదే

నువు లేకుంటే

మనసేమో పదే పదే నీతో జ్ఞాపకాలను

గురుతుకు తెస్తుందే

ప్రాణం నలిగిన ప్రేమకు ఇకపై

ఆశలన్నీ నీమీదే॥ప్పుడు॥॥

చరణం : 2

ప్రేమ తొలిప్రేమ

నీ చిరునామా ఏదంటూ

నిన్నే వెతుకుతున్నా నువ్వే దారి చూపించు

కసిరే నడిరాతిరి ఎటుగా నిను దాచినా చేరగలేనా

లోకం నలువైపులా ఆపే గిరిగీసిన

దూసుకు రాలేనా

జతగా నడిచిన నిన్నటి అడుగే నీకోసం వస్తున్నా॥ప్పుడు॥॥

Share This :



sentiment_satisfied Emoticon