పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండు రాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యమును; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు దృష్టద్యుమ్నుడు; తవ — మీ యొక్క; శిష్యేణ — శిష్యుడు; ధీ-మతా — తెలివైనవాడు.
Meaning ::
దుర్యోధనుడు పలికెను: గౌరవనీయులైన గురువర్యా! మీ ప్రియ శిష్యుడు, ద్రుపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుప బడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon