కలిసి వుంటే కలదు సుఖము సాంగ్ లిరిక్స్ మరోచరిత్ర (1978) | తెలుగు సినిమా

 


Album:Maro Charitra


Starring:Kamal Haasan, Saritha
Music :M. S. Viswanathan
Lyrics-Athreya
Singers:S.P. Balu, Ramola
Producer:Rama Arangannal
Director:K. Balachander
Year:1978

English Script Lyrics Click Hereకలిసి వుంటే కలదు సుఖము సాంగ్ లిరిక్స్
కలిసి వుంటే కలదు సుఖము.. కలసి వచ్చిన అదృష్టము
శభాష్ ... అహా.. హ... హ...
కలిసి వుంటే...కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులూ.. మూగ మనసులూ ఆ..
అ..కన్నె మనసులూ.. మూగ మనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ

||కలసి||

మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి... ఆ ఛీ! ఏం కాదు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి
ఆఆ డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు.. ఓ అలాగా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...హ హ అయ్యొ పిచ్చి వాడు
ఏయ్.. మంచి వాడు మామకు తగ్గ అల్లుడూ..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ ||2||
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు... హమ్మ బాబొయ్
డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||
Share This :sentiment_satisfied Emoticon