జూనియర్ జూనియర్ సాంగ్ లిరిక్స్ ఇది కధ కాదు (1979) తెలుగు సినిమాAlbum : Idi Katha Kaadu


Starring: JayasudhaKamal HaasanChiranjeevi

Music : M. S. Viswanathan

Lyrics-Acharya Atreya

Singers :  S. P. Balasubrahmanyam, Ramola

Producer: M. S. Viswanathan

Director: K. Balachander

Year: 1979

English  Script Lyrics Click Here


జూనియర్ జూనియర్ సాంగ్ లిరిక్స్  ఇది కధ కాదు


జూనియర్.. జూనియర్.. జూనియర్...

Yes Boss

ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2||

అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2||

ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ..

గడ్డిపోచా? నేనా? హి హి హి హి..

ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు...


ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు

వుందని ఎందుకు ఒప్పుకోరాదు...

రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు

ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు..


జూనియర్ జూనియర్ జూనియర్

ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...


సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా..

కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..

నీ మొహమురా హి హి హి హి హి...

సాగరమున్నా తీరనిది నీ దాహమురా..

కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..

తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2||


నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే

పాపం గీపం అనడం ఛాదస్తం

No it's bad...

But I am mad...

మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను

మోసం ద్రోహం అనడం అన్యాయం

హ హ హ హ

what పక పక పిక పిక.. హూ...


జూనియర్..ఊ...

జూనియర్ జూనియర్ జూనియర్

ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...చైత్రము లోన చినుకు పడాలని కోరేవు

మార్గసిరాన మండుటెండకై చూసేవు

Boss, Love has no season, not even reason

Shut up

చైత్రము లోన చినుకు పడాలని కోరేవు

మార్గిశిరాన మండుటెండకై చూసేవు

ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ||2||


ఎండా వాన కలిసొస్తాయి

వెలుగు చీకటి కలిసుంటాయి

జరగని వింతలు ఎన్నో జరిగాయి

It is highly idiotic

No boss, it is fully romantic

హ హ హ హ

పాట పాడెను ముద్దుల బొమ్మ

పక పక నవ్వేవెందులకమ్మా

మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా

మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా


ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు 

Share This :sentiment_satisfied Emoticon