అల్లో నేరేడు కళ్ళ దాన సాంగ్ లిరిక్స్ శీను (1999) తెలుగు సినిమాAlbum : Seenu


Starring: Venkatesh, Twinkle Khanna
Music : Mani Sharma
Singers :PardhaSaradhi, Chitra
Producer: R. B. Choudary
Director: Sasi
Year: 1999

English Script Lyrics Click Here

అల్లో నేరేడు కళ్ళ దాన సాంగ్ లిరిక్స్అల్లో నేరేడు కళ్ళ దాన 

ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా 
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా 
అల్లుకుంటూ ఒళ్ళో లేనా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

దాయీ దాయీ అనగానే 
చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే 
పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక 
మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా 
చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని 
కంటిపాప ఇంటిలోన ఏరికోరి 
చేరుకున్న దీపమా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

అన్నెం పున్నెం లేని వాడని 
అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని 
అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో 
మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో 
తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో 
సంకురాత్రి పండగంటి సందడల్లే 
చేరుకున్న రూపమా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా 
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా 
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
Share This :sentiment_satisfied Emoticon