బ్రహ్మలూ గురు బ్రహ్మలూ సాంగ్ లిరిక్స్ ఎగిరే పావురమా (1997) తెలుగు సినిమా

Album Egire Paavurama

Starring:Srikanth, JD Chakravarthy, Laila
Music :S. V. Krishna Reddy
Lyrics-Veturi
Singers :S.P. Balu
Producer:P. Usha Rani
Director:S. V. Krishna Reddy
Year:1997


English Script Lyrics Click Hereబ్రహ్మలూ గురు బ్రహ్మలూ సాంగ్ లిరిక్స్ 

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు

శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు

శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

వేదమూర్తులై నాద యోగ సాధకులై
పరమొకటే కోరుకున్న ఆ స్వర ధనులెవరో
తెలసి తలచి నా ఉపాధికై రాగ భావ జాలనలో
గతివిడిచీ పాడుకున్న నా అభినవ జతినే
వలచి మలచి తీసానులే కొత్త రాగమే హా హా
అ అ అ అ వేశానులే... ఆది తాళమే...
పదమునాకు మనుగడకాగా 
లయలు జతులు క్రియలు ప్రియముకాగా 
జగతినెరిగి సుగమగతులనడిగె...

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

త్యాగబ్రహ్మమూ తాళ్ళపాక అన్నమయా
జపియించే భక్తి భావనా సురభిళకృతులే
తలచి తరచీ నూతనత్వమే 
కోరుకున్న అభిరుచులే
గమనించీ నవ్యరీతిలో 
గమకపు లయతో కలిసి మెలిసి 
సాగేనులే బాటసారిగా ఆ...ఆఆఆ..
సంగీతమే జీవనాడిగా...
తెలుగు పాట జగతికి చాట 
చిలిపి వలపు కలిపి పదము పాడ 
మనసు నిలిపి మధుర జతుల తేలె.

బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు

సనిపమా నిపమనీ రిగరిస
సనిపని సనిపమ పనిపమ రిగరిస
నిసరిగరి నిసరిపమ సరిమపని సరిమపప
రిప పనిప మప నిసరిస రిసనిపనిస సనిపదనిప
మపరిగరిస నిసరిమ నిసరిమప రిమపని
రిమపనిస మపనిస మపనిసరిస 
ఆ... ఆ... ఆఆ....
Share This :sentiment_satisfied Emoticon