ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో సాంగ్ లిరిక్స్ ఎంత మంచివాడవురా (2020) తెలుగు సినిమా


Album : Entha Manchivaadavuraa


Starring: Kalyan Ram, Mehreen Pirzada
Music : Gopi Sunder
Singers :S.P. Balasubramanyam 
Producer: Umesh Gupta, Subhash Gupta
Director: Satish Vegesna
Year: 2020

English Script Lyrics Lyrics Click Here


ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో సాంగ్ లిరిక్స్
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనో బలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

ఏ రక్త బంధం లేకున్నా గాని
స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా
అందించగలిగిన వారదులం
ఓ గుండె నిప్పును ఆర్పడం
ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి
పాడడం ఆహా ఎంత వరం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం

ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆలోటు తీర్చగా
ఇపుడూ ఎపుడూ
మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే
భుజం మనమవుదాం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
Share This :sentiment_satisfied Emoticon