వందే వాసుదేవం అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: వందే వాసుదేవం

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics

వందే వాసుదేవం బృందారకాధీశ
వందిత పదాబ్జం ‖

ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకిత లసత్చారు దేహం |
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభం ‖

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప-
న్నగరాజ శాయినం ఘననివాసం ‖

కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే ‖
Share This :sentiment_satisfied Emoticon