మనుజుడై పుట్టి మనుజుని సేవించి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde LyricsAlbum :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: మనుజుడై పుట్టి మనుజుని 


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ‖

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ‖

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ‖Share This :sentiment_satisfied Emoticon