ఏయ్ పిల్లా పరుగున పోదామా. సాంగ్ లిరిక్స్ లవ్ స్టొరీ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Love Story


Music : Pawan Ch
Lyrics-Chaithanya Pingali 
Singers :Haricharan
Producer: Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao
Director: Sekhar Kammula
Year: 2020


English Script Lyrics Click Here
ఏయ్ పిల్లా పరుగున పోదామా. సాంగ్ లిరిక్స్


ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా…
రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు …
ఆ.. రంగుల విల్లుని తీసి.. ఈ వైపు వంతెన వేసి.. రావా..

ఎన్నో తలపులు, ఏవో కలతలు బతుకే పొరవుతున్నా..
గాల్లో పతంగిమల్లె.. ఎగిరే కలలే నావి..

ఆశనిరాశల ఉయ్యాలాటలు, పొద్దుమాపుల మధ్యే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..

నీతో ఇలా.. ఏ బెరుకు లేకుండా..
నివ్వే ఇగ.. నా బతుకు అంటున్నా..

నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా..
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిలమిల చూడే..
వచ్చే మలుపులు, రస్తా వెలుగులు.. జారే చినుకుల జల్లే..
పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే..

పొద్దే తెలియక, గల్లీ పొడుగున.. ఆడే పిల్లల హోరే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..

ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా…

పారే నదై నా కలలు ఉన్నాయి చేరే దరే ఓ వెదుకుతున్నాయే..
నా గుండె ఓలి చేసి, ఆచి తూచి అందించా జాతరలా..

ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే..
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి.. నేలన కనిపిస్తుందే…
మారే నీడలు గీసే.. తేలే బొమ్మలు చూడే..
పట్నం చేరిన పాలపుంతలు.. పల్లెల సంతలు బారే..

నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..
Share This :sentiment_satisfied Emoticon