పిన్ని (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - జెమిని టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics

Album : Pinni [ Gemini TV Serial]


Starring:  Raadhika; Deepa Venkat; Sivakumar;
Music :Dina
Lyrics-P. Omkar
Singers :Nitya Sri
Producer: Radaan Mediaworks
Director: 
Year: 1999

Telugu Script Lyrics Click Hereపిన్ని (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్
 కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 

నిని సాసాస.. నిని సాసాస
నిసగగ నిసగగ గమపమగరిసా
నిసగగ నిసగగ గమపమగరిసా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం
గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం కాదా
సీత గీత దాటిందా యుద్దకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...ఓఓఓ...
ఝుంతనఝనఝన..ఝుంతనఝనఝన..
ఝుంతన..ఝుంతన..ఝుంతనన..ఓఓఓ...

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 


Share This :sentiment_satisfied Emoticon