ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి (ఇంకా చెప్పాలే) సాంగ్ లిరిక్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) తెలుగు సినిమా





Album: Seethamma Vakitlo Sirimalle Chettu

Starring:Mahesh BabuSamanthaVenkatesh, Anjali
Singers :Rahul Nambiyar, Shweta Pandit
Producer:Dil Raju
Director:Srikanth Addala

Year: 2013

English Script Lyrics Click HERe

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి (ఇంకా చెప్పాలే) సాంగ్ లిరిక్స్


ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
Share This :



sentiment_satisfied Emoticon