తొలి వలపే పదే సాంగ్ లిరిక్స్ దేవత (1965) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Devatha


Starring: N. T. Rama Rao Savitri
Music : S. P. Kodandapani

Lyrics- Sri Sri

Producer: B. Purushottam
Director: Hemambharadhara Rao

Year: 1965


Telugu Script Lyrics Click Here


తొలి వలపే పదే సాంగ్ లిరిక్స్తొలి వలపే.. పదే పదే పిలిచే
యెదలో సందడి చేసే..
తొలి వలపే.. పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే..
తొలివలపే... ఏ.. ఏ...
ఆ...ఆ.. ఆ.. ఆ... ఆ...

ఏమో.. ఇది ఏమో..
నీ పెదవుల విరిసే
నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం.. అనుబంధం..
నా మనసున మీకై దాచిన..
పూచిన కానుకలు

ఏమో.. ఇది ఏమో..
నీ పెదవుల విరిసే
నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం.. అనుబంధం..
నా మనసున మీకై దాచిన..
పూచిన కానుకలు

నీ కన్నుల వెలిగెనే దీపాలు...
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
నీ కన్నుల వెలిగెనే దీపాలు...
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు...

తొలి వలపే పదే పదే పిలిచే...
యెదలో సందడి చేసే...
తొలి వలపే... ఏ...

గరినిరిగ... ఆ..ఆ.ఆ..
మగరిగమ.. ఆ ..ఆ.. ఆ..
గమనిదనీదప... ఆ... ఆ... ఆ...

ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే..
తీయగ.. హాయిగ.. ఈ జగము..

యవ్వనము.. అనుభవమూ..
జత కూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే..
తీయగ.. హాయిగ.. ఈ జగము..

యవ్వనము.. అనుభవమూ..
జత కూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

ఈ రేయి పలికెలే.. స్వాగతమూ
ఈనాడే బ్రతుకున.. శుభదినమూ
ఈ రేయి పలికెలే.. స్వాగతమూ
ఈనాడే బ్రతుకున.. శుభదినమూ
ఈ తనువే మనకిక చెరిసగము

తొలి వలపే పదే పదే పిలిచే...
యెదలో సందడి చేసే...
తొలి వలపే పదే పదే పిలిచే...
మదిలో మల్లెలు విరిసే...
తొలివలపే... ఏ.. ఏ...
Share This :sentiment_satisfied Emoticon