పచ్చి పాల వెన్నెలా సాంగ్ లిరిక్స్ బతుకమ్మ (2019) బతుకమ్మ పాటలు | Aarde LyricsAlbum : Bathukamma


Song :: Pachhi Pala Vennela
Music : Madeen SK
Lyrics-Mittapelli Surender
Singers :Mangli
Producer: Pochampally Kondal Reddy, Shivaprasad Balla
Director: Damu Reddy 
Year: 2019

English  Script Lyrics Click Here


పచ్చి పాల వెన్నెలా
నేలన పారపోసినట్టు పూసెనే
గుణుగుపూల తోటలు
పచ్చి పసుపుగొమ్ములో
పసుపు తీసి రాసినట్టుగా
పూచే తంగేడు కొమ్మలు
వేల రంగులపువ్వులోయ్
బతుకమ్మ నీ చీరలు
కోనేటిలో కలువలోయ్
గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందాల మహరాణివే
నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే
పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి
మురిసెనె పాటతో ప్రతి లోగిలి

గంగమ్మ చినుకై నీ కోసం
చెరువులో నిలిచింది ఆకాశం
నీరాక కోసం చెట్లు పులకించి పూసెనే నీ పూజ నీ కోసమే
గట్లపై గంధాలు దాచింది నీకోసం
గుమ్మాడి పువ్వులో ఈమాసం
గుడిలేని దైవం నీవు బతుకమ్మ..
నీకు ప్రతి ఇళ్లు నిలయమే
వయ్యారి భామ పూలోయ్ నీ ముక్కుకు ముక్కెరలు
అడవి మొదుగుపువులోయ్
నీ నుదుట కుంకుమలు
ఎంతటి అందాల మహారణివే
నీ చుట్టు పూలన్నీ చెలికత్తెలే
నిన్ను చూడాలని ముందుగా వచ్చిందె పువ్వుల దీపావళీ
బతుకమ్మ రాకతో మా వాకిలి
మురిసెనే పాటతో ప్రతి లోగిలి
కని పెంచుతుంది సెలక
పువ్వుల సీతాకోక చిలక
మట్టిపూల పరిమళాల పాటల పల్లవులు కట్టి పెంచుతుంది సెలక పువ్వుల సీతాకోక చిలక

ఆ తేనెపట్టులో తీపిని.. నీకోసం
ఉయ్యాల పాటల్లో కలబోసాం
మ పాటలింటూ ఊరేగరావె పల్లెటూర్లలో..
మిణుగురు పురుగల్లో వెలుగుల్ని నీకోసం దారుల్లో దివిటీగా రాజేసాం
ఆటాడునమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై
తలమీద అగ్నిపులోయ్
నీ తనువుకాభరణము
తెలంగాణలో పుడితివోయ్
నువ్వు ఎనిమిదో వర్ణము
ఎంతటి అందాల మహారాణివే
నీ చుట్టు పులన్ని చెలికత్తెలే
నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి
బతుకమ్మ రాకతో మా వాకిలి
మురిసెనే పాటతో ప్రతి లోగిలి

పచ్చిపాల వెన్నెలా
నేలన పారబోసినట్టు పూసెనే గుణుగుపూల తోటలు
పచ్చి పసుపుగొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా
పూచే తంగేడు కొమ్మలు
వేల రంగుల పువ్వులోయ్
బతుకమ్మ నీ చీరలు
కోనేటిలో కలువలోయ్
గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందాల మహారాణివే
నీ చుట్టు పులన్నీ చెలికత్తెలే
నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి
బతుకమ్మ రాకతో మా వాకిలి
మురిసెనే పాటతో ప్రతి లోగిలి
నిన్ను పిలిచెనమ్మ ఏరు
సాగనంపుతోంది ఊరు
అలలమీద ఊయలూగి
ఆటాడుకోవే అని పిలిచెనమ్మ ఏరు సాగనంపుతోంది ఊరు
Share This :sentiment_satisfied Emoticon