ఓ నిండు చందమామ సాంగ్ లిరిక్స్ బంగారు తిమ్మరాజు (1963) తెలుగు సినిమాAlbum : Bangaru Thimmaraju


Starring: Kantarao, Rajanala, Geethanjali, Vani Sri
Music : Sp Kodanda Pani
Lyrics-Arudra
Singers : K J Yesudasu
Producer: Gowri Productions
Director: G Viswanadham 
Year: 1963

English Script Lyrics Click Here
ఓ నిండు చందమామ సాంగ్ లిరిక్స్ ఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ...

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..

ఓ ఓ ఓ నిండు

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..

ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....
Share This :sentiment_satisfied Emoticon