మనసార మనసార సాంగ్ లిరిక్స్ తోలు బొమ్మలాట (2019) తెలుగు సినిమా

Album : Tholu Bommalata


Starring: Viswant, Harshitha Chowdary
Music : Suresh Bobbili
Lyrics-Chaitanya Prasad 
Singers :Sid Sriram 
Producer: Durga Prasad Maganti
Director: Viswanath Maganti

English Script Lyrics Click Here
మనసార మనసార సాంగ్ లిరిక్స్

మనసార మనసార మనసులు వేరయ్యే
తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలె
విధి రాయని కథ లోన విరహం మిగిలేలె
చిరు నవ్వే వెలిపోతు పలికె వీడ్కోలే

నా ప్రాణమే నన్నొదిలేసి వెలిపోయె
ఆవేదనే తోడైందిలె
మనమన్నదే ఓ మతిలేని మాటయ్యే
నువు నేనుగా విడిపోయిందిలే

ఈ శూన్యమే ఇక నా నేస్తమై
ఎదలొ కొలువై ఉంటుంది జంటై
దరహాసమే ఒక పరిహాసమై
తిరిగా నేనె నడిచే వింతై
గురి చూసి కొడితే తగిలింది బాణం
ఎదలోని గాయం మానేనా
ఈ బాధతో నే బతకాలి
కలకాలం బాదే సుఖం అనుకోవాలిలే

నా ప్రాణమే నన్నొదిలేసి వెలిపోయె
ఆవేదనే తోడైందిలె

నా ఊపిరే పెను సుడిగాలిల
కసిగా దూరం తొసింది నిన్నే
నీ ఊహలె నను ఊపెయగా
పిచ్చే పట్టి తిరిగా నేనే
నువు రాకు అన్న కన్నీరు వినదే
కలలన్ని కరిగి కురిసేలే
ఈ శోకమే నా లొకంగా మారింది
నా ఆశనే మసి చేసిందిలే

నా ప్రాణమే నన్నొదిలేసి వెలిపోయె
ఆవేదనే తోడైందిలె
Share This :sentiment_satisfied Emoticon