చీకటి వెలుగుల రంగేళి సాంగ్ లిరిక్స్ విచిత్ర బంధం (1972) తెలుగు సినిమాAlbum Vichitra Bandham


Starring: ANR, Vanisri
Music :K. V. Mahadevan
Lyrics- Athreya
Singers : Ghantasala,P.Susheela
Producer:D. Madhusudhana Rao
Director: Adurthi Subba Rao
Year: 1972

English Script Lyrics Click HERE


చీకటి వెలుగుల రంగేళి  సాంగ్ లిరిక్స్చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలవెలిగించు దీపాల వెల్లి
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావతో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు
లల్లలా హహహా ఆ ఆ ఆ
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు
మరదళ్ళు చూస్తారు మర్యాద వాళ్ళకు
బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు
బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు అహహహహ
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టిన రోజున దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు తోడు
అహహ అహహహ అహ ఆ ఆ ఆ
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
Share This :sentiment_satisfied Emoticon