ప్రేమంటే నిజంగా ఏమంటే సాంగ్ లిరిక్స్ గోవిందా గోవిందా (1994) తెలుగు సినిమా


Album: Govinda Govinda
Starring:Akkineni Nagarjuna, Sri Devi
Music :: Raj-Koti
Lyrics-Sirivennela
Singers : SP Balu, Chitra
Producer:C. Ashwini Dutt
Director:Ram Gopal Varma
Year:1994English Script Lyrics Click Hereప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్లా చెప్పగలం
ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం
తొలిచినుకుల తడి ఇదని తొలి కిరణపు తళుకిదని
తొలివలపుల తలపిదని ఎట్టాగ పోల్చడం
ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్లా చెప్పగలం
ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం

ఊటీకైనా చెమటలు పట్టే హీటుంది ఈ ప్రేమలో
ఉప్పెనకైనా ఒణుకులు పుట్టే ఊపుంది ఈ ప్రేమలో
వెనుతిరగని వేగాలతో తొలి కదలిక ఏనాటిదో
మునుపెరుగని రాగాలతో పిలిచిన స్వరమేమంటదో. 
జతకుదిరిన క్షణమిదని ముడి బిగిసిన గుణమిదని
కథ ముదిరిన విధమిదని ఎట్టాగ తేలచ్డం

శంకరుడైనా కింకరుడైనా లొంగాలి లవ్ ధాటికి
పండితుడైనా పామరుడైనా పసివాడే సయ్యాటకి
తుది ఎరుగని ప్రేమాయణం మొదలెపుడని ఊహించడం
గత చరితల పారాయణం గతులెన్నని వివరించడం
పరులెరుగని అనుభవమై పదపదమను అవసరమై
పయనించే ప్రణయరధం ఎటు పరుగు తియ్యునో

ప్రేమంటే తేనలా తీయగ వుంటుందనువారు
తేనెంటే ఏమిటో తెలియకనే అనివుంటారు
మనసును గిల్లే ముల్లే కాదా ప్రేమ
నిదురను చిదిమే అల్లరి కాదా ప్రేమ
తరుముకు వచ్చే తేనటీగ కద ప్రేమ
తెలియక దిగితే తేలరు అయ్యోరామా
ఏమిటో ప్రేమన్నది- ప్రేమకే తెలియాలి మరి ||ప్రేమ||

కోటి చుక్కలంటే ఆమె రెండుకళ్ళే అంటున్న ప్రేమతో
కొత్తలెక్కలేస్తే ఆమె తప్ప వేరే జనులంటూ ఉండరే
ఎండంటే ఆమె కోపం- నీడంటే ఆమె స్నేహం
వానవిల్లు ఆమె రూపం- లోకమంటే ఆమే అంది ప్రేమ
మతి చెడెనేమో అనుకుంటే ఎవరైనా
చిన్న నవ్వు నవ్వి జాలిపడుతుంది ప్రేమ
ఏమిటో ప్రేమన్నది - ప్రేమకే తెలియాలి మరి ||ప్రేమంటే|

రాసుకుంది మనసు సరికొత్త డైరీ- ఈ ప్రేమ భాషతో
లక్షలాది పుటలు నింపుతుంది డైలీ- ఒక చిన్నమాటతో
ఇష్టాలను మార్చమంటూ కష్టాలను కోరమంటూ
నన్ను నేనే పోల్చనట్టు ఎంత మాయచేసిందో ఈ ప్రేమ
అది చెబుదామని అనుకుంటూనే వున్నా.
తను ఎదురైతే ఇంకేదో అంటున్నాను 
ఏమిటో ప్రేమన్నది - ప్రేమకే తెలియాలి మరి ||ప్రేమంటే|
Share This :sentiment_satisfied Emoticon