ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ సాంగ్ లిరిక్స్ మనసులో మాట (1999) తెలుగు సినిమా


Album : Manasulo Maata

Starring: Srikanth, Jagapathi Babu, Mahima Chaudhry
Music : S. V. Krishna Reddy
Lyrics-veturi
Singers :Udit Narayan
Producer: P. Usha Rani
Director: S. V. Krishna Reddy

Year: 1999
English Script Lyrics Click Hereఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ 
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్ 
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ 
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా 
జగడాలు లేవురా

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ 
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

కూచిపూడి నడగొచ్చులే ఒసిబిస
హాలివుడ్‌లో తీయొచ్చులే లవకుశ
మడోనాకు నేర్పొచ్చులే పదనిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన
స్నేహం మనదోయి
జానెదేవ్ సహోదరా 
జగడాలు లేవురా॥

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ 
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

పార్లమెంటు నడగొచ్చులే పెళ్లికి
తాజ్‌మహల్‌ నడగొచ్చులే విడిదికి
జాక్సనొస్తే అడగొచ్చులే జావళే
బాలమురళి నడగొచ్చులే రాప్‌నే
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జానెదేవ్ సహోదరా 
జగడాలు లేవురా.. 

ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ 
చేసిన ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా

తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్ 
చేసిన ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ 
మార్చిన ఈశ్వరా
జానెదేవ్ సహోదరా 
జగడాలు లేవురా  
Share This :sentiment_satisfied Emoticon