కళ్యాణం వైభోగం సాంగ్ లిరిక్స్ శ్రీనివాస కళ్యాణం (2018) తెలుగు సినిమా


Starring: Nithiin, Raashi Khanna, Nandita Swetha
Music : Mickey J Meyer
Lyrics-Srimani 
Singers :S.P.Balasubramanyam
Producer: Dil Raju & Shirish
Director: Vegesna Satish
Year: 2018

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం 
రఘువంశ రామయ్య 
సుగుణాల  సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే
వధువు మది గెలిచాకే
మోగింది కల్యాణ శుభవీణ
కళ్యాణం వైభోగం
శ్రీ రామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి
అందాల రమణి
వినగానే క్రిష్ణయ్య లీలామృతం
గుడి దాటి కదిలింది
తనవేన నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విల వలపు ప్రణయాల
చెలి మనసు గెలిచాకే
కల్యాణ కలలొలికినాడమ్మా
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
రుణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేదం మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపంపై
వరుడంటూ వదువంటూ
ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసారం
సాగరపు మదనని సాగించమంటున్నది

జన్మంటూ పొంది జన్మివలేని
మనుజునకు సార్థక్యముండదు కదా

మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా
కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)