Album: Rakshasudu
Starring:Suriya, Nayantara , Premgi Amaren, Pranitha Subhash
Music :Yuvan Shankar Raja, S. Thaman
Lyrics-Vennelakanti
Singers :Chinmayi, Karthik
Producer:K. E. Gnanavel Raja
Director:Venkat Prabhu
Year: 2015
నీ నీడవుతా నీ తోడవుతా
అడుగులో అడుగునై నీ నీడవుతా
నీ నింగిలో రెండో జాబిలినై
నే నిలిచే వరమీవా వరమీవా
ఆమెను మరపించకపొయినా
తలపించేలా నీ గుండెల్లో కాపురముంటా
కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని
నీకివ్వడానికి తడబాటు
కానీ చెలియా కానీ చెలియా
ఆమెతొ చేసిన పయనాలు
నీతో కావాలీ అలవాటు
నా నింగిలో ఒక తారగ వచ్చావులే
మెల మెల్లగా వెన్నెలై నిండావులే నా గుండెలో
నా నేలపై ఒక పువ్వై విచ్చావులే
మెల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో
చిరునవ్వై నువ్వొస్తే చిగురించా మళ్ళీ నేను
సిరిమువ్వై నా ఎదలో రవళించావే..
వచ్చింది నాకోసమే ఇలా అమవాస లోన వెన్నెలా
కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి...
నేనిన్ను ప్రేమించు ముందే
నీ ప్రేమంత నా చిట్టితల్లికి నువ్విచ్చావ్ ఇంకేమి
నే కోరకుండానే వరమిచ్చు దేవతల దిగివస్తివే
ఒడిలో చేర్చీ జోలాలి పాడీ
నువ్ సేద దీర్చగా నా గాయమారెలే
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా మౌనం నీవేనా గానం
నీవే నా ధ్యానం
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా హృదయం నీవే నా ప్రయణం
నీవే నా లోకం
comment 1 comments:
more_vertనే కోరకుండానే వరమిచ్చు దేవతల "ధివి నుండి" దిగివస్తివే
sentiment_satisfied Emoticon